
ఐసీడీఎస్ పీడీగా లక్ష్మి
కాకినాడ క్రైం: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి(ఐసీడీఎస్ పీడీ)గా చెరుకూరి లక్ష్మి గురువారం కాకినాడ గాంధీనగర్‌లోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజానగరం సీడీపీవోగా పనిచేస్తూ రాజమహేంద్రవరం ఇన్‌చార్జి పీడీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న ఆమెకు తాజాగా పదోన్నతి లభించింది. ప్రభుత్వం ఆమెను కాకినాడ జిల్లా ఐసీడీఎస్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీడీ లక్ష్మిని మిషన్ వాత్సల్య డీసీపీవో వెంకట్ ఆధ్వర్యంలో బృందం కలిసి అభినందనలు తెలిపింది. అనంతరం శాఖ సిబ్బందితో పీడీ సమీక్ష నిర్వహించారు.