
బాలికల హాకీ పోటీలకు సర్వం సిద్ధం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడలోని డీఎస్‌ఏ మైదానంలో జాతీయస్థాయి జూనియర్ బాలికల హాకీ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యియి. మైదానంలోని హాకీ టర్ఫ్‌పై శుక్రవారం నుంచి ఈ నెల పదో వరకూ ఈ పోటీలు జరుగుతాయి. 2022లో బాలికల విభాగంలో జూనియర్ నేషనల్ పోటీలను ఇక్కడ నిర్వహించారు. 2023లో సీనియర్ నేషనల్స్ బాలికల విభాగంలో జరిగాయి. ఇప్పుడు మూడోసారి జూనియర్ బాలికల జాతీయ స్థాయి హాకీ పోటీలకు రంగం సిద్ధమైంది. సుమారు రూ.20 లక్షల బడ్జెట్‌తో వీటిని నిర్వహిస్తున్నారు.
29 రాష్ట్రాల క్రీడాకారుల రాక
ఈ పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన 522 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారితో పాటు 58 మంది కోచ్‌లు, మేనేజర్లు, స్థానిక అఫీషియల్స్‌తో కలిపి సుమారు 660 మంది హాజరవుతున్నారు. పోటీల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడిగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్య రాజ్, నిర్వహణ కార్యదర్శిగా జి.హర్షవర్ధన్, సంయుక్త నిర్వహణ కార్యదర్శిగా కాకినాడ జిల్లాకు చెందిన వి.రవిరాజు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ స్వీయ పర్యవేక్షణలో జేసీ రాహుల్ కుమార్.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. పూల్– ఎలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, పూల్ –బిలో మధ్యప్రదేశ్, పంజాబ్, చంఢీఘడ్, పూల్ –సిలో హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్, పూల్ –డిలో ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి.
నేటి నుంచి పదో తేదీ వరకూ నిర్వహణ
కాకినాడ డీఎస్‌ఏ మైదానంలోపూర్తయిన ఏర్పాట్లు