
విద్యార్థి దశ నుంచే క్రీడాసక్తి పెంచుకోవాలి
పెద్దాపురం: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడాసక్తి పెంపొందించుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ ఈడీ మట్టే ఆది శంకర్, ప్రముఖ డెర్మాలజిస్ట్ డాక్టర్ మట్టే స్రవంతి అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడా నైపుణ్యం ఎంతో అవసరమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పాండిచ్చేరికి చెందిన 458 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
మూడు రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో 101 లీగ్ మ్యాచులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, పీఈటి సత్యనారాయణ తెలిపారు. అండర్–14 బాలికల విభాగంలో ఖమ్మం క్లస్టర్, అండర్–17 విభాగంలో పిమోగా క్లస్టర్, అండర్–19 విభాగంలో కృష్ణ క్లస్టర్ విజేతలుగా నిలిచాయన్నారు. అండర్–14 బాలుర విభాగంలో బీదర్ క్లస్టర్, అండర్–17 విభాగంలో కడప క్లస్టర్, అండర్–19 విభాగంలో పిమోగా క్లస్టర్ విజయం సాధించాయని తెలిపారు. రీజినల్ మీట్‌లో ఆల్‌రౌండ్ ఛాంపియన్‌గా పిమోగా క్లస్టర్ (కేరళలో కొన్ని జిల్లాలు), కర్ణాటకలో కొన్ని జిల్లాలు కలిసి ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాయన్నారు.
పారిశ్రామిక వేత్త మట్టే ఆదిశంకర్
జేఎన్‌వీలో ముగిసిన కబడ్డీ మీట్