
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పలువురు నియామకం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు తూర్పుగోదావరి జిల్లా పార్టీ కమిటీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కడియాల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాసి వెంకటరావు, ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా ముప్పన శ్రీనివాస్, లక్కోజు ఓంకార్, యాక్టివిటీ సెక్రటరీలుగా తమ్మిశెట్టి శివప్రసాద్, దామదాసు శ్యాంసుందర్, ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా రొక్కం త్రినాథ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గృహ నిర్మాణాల్లో
పురోగతి ఉండాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అందరికీ గృహం’ కార్యక్రమం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాల లక్ష్యంలో దిగువ స్ధానంలో ఉన్న ఐదు మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీతానగరం, నల్లజర్ల, దేవరపల్లి, రాజానగరం, కడియం మండలాల పరిధిలో అదనపు ఆర్థిక సహాయం పొందిన 704 మంది లబ్ధిదారుల్లో150 ఇళ్లు మాత్రమే రూఫ్ లెవెల్ దశను చేరుకున్నాయని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పలువురు నియామకం