వేతన యాతన | - | Sakshi
Sakshi News home page

వేతన యాతన

Jul 30 2025 8:40 AM | Updated on Jul 30 2025 8:40 AM

వేతన

వేతన యాతన

జీతాలివ్వకపోతే

ఎలా బతుకుతారు?

పారిశుధ్య కార్మికులకు సక్రమంగా జీతాలివ్వకపోతే ఎలా బతుకుతారో ప్రభుత్వం ఆలోచించాలి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాలకుల చేతుల్లో మోసపోవడం పరిపాటిగా మారుతోంది. ఏదో ఒక ఉద్యోగం దొరికిందని సంతోషపడాలో.. లేక సక్రమంగా జీతాలందక, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమై, అకాల మరణం పొందితే కనీస ఆర్థిక సహాయం కూడా అందక కుటుంబాలు రోడ్డున పడుతున్న దీనస్థితిని తలచుకొని బాధపడాలో తెలియని పరిస్థితి. వీరిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకిచ్చే వేతనాలను ప్రభుత్వం కాంట్రాక్టర్‌ ద్వారా ఇచ్చే విధానం వల్ల కొంత.. కాంట్రాక్టర్‌ వద్ద కొంత ఆలస్యం జరుగుతూండటంతో నెలల తరబడి జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికై నా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం నెలకు రూ.28 వేలు ఇవ్వాలి. పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే వారి పక్షాన ఉద్యమం చేపడతాం.

– ఈమని గ్రీష్మకుమార్‌,

జిల్లా సహాయ కార్యదర్శి, ఐఎఫ్‌టీయూ

ప్రతి నెలా చెల్లించాలి

వేతనాల కోసం ప్రతి నెలా ఎదురు చూస్తూనే ఉంటున్నాం. నిడదవోలు ప్రభుత్వాస్పత్రిలో పదేళ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్నాను. సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటోంది. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా జీతాలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– కొడమంచిలి శారమ్మ,

పారిశుధ్య కార్మికురాలు, నిడదవోలు

నిడదవోలు: ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం వస్తే కుటుంబ సభ్యులే సరిగ్గా చూడని రోజులివి. వారికి పరిచర్యలు చేయాల్సి వస్తే మరింత యాతన. అటువంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగు జీవులు వారు. జీవనోపాధి కోసం క్లిష్టమైన పరిస్థితులను సైతం సహిస్తూ ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులుగా కొనసాగుతున్నారు. బండెడు చాకిరీ చేస్తున్న వారికిస్తున్న వేతనాలు గంపెడు కూడా ఉండవు. అది కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో నానా ఇక్కట్లూ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

కష్టం ఎక్కువ.. వేతనం తక్కువ

ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆ ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాదు.. రోగులను అక్కున చేర్చుకుని పరిచర్యలు చేస్తూంటారు. రోగులు వాంతులు, మలమూత్ర విసర్జన చేసుకున్నా అసహ్యించుకోకుండా శుభ్రపరుస్తారు. దగ్గరుండి బాత్రూములకు కూడా తీసుకువెళ్తారు. వేకువజామునే విధులకు హాజరై ఓపీ ప్రారంభించక ముందే వార్డులు, పరిసరాలను చీపుర్లతో నిత్యం శుభ్రం చేస్తారు. వాడి పడేసిన సిరంజులు, ఇంజెక్షన్లు, ప్రమాదకరమైన బయో మెడికల్‌ వేస్ట్‌ పదార్థాలను బయటకు తరలిస్తారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు కుట్లు వేస్తున్న సమయంలో ఆ వ్యర్థాలను తీసుకువెళ్లి బయట పడేస్తారు. నెలంతా ఇంత చాకిరీ చేస్తున్న వారికి ఇస్తున్న వేతనం కోతలు పోనూ రూ.11,800 మాత్రమే ఉంటోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో 129 మంది పారిశుధ్య కార్మికులున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో 89 మంది పని చేస్తూండగా వీరికి ఒక నెల జీతం బకాయి పెట్టారు. నిడదవోలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)లో ఆరుగురు కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో 13 మందికి రెండు నెలలుగా.. గోపాలపురం ప్రభుత్వాస్పత్రిలో మూడు నెలలుగా అనపర్తి సీహెచ్‌సీలో 13 మందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఇస్తున్నదే అరకొర వేతనం కాగా.. అది కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఈ బడుగు జీవులు గగ్గోలు పెడుతున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వారితో పోలిస్తే సగం జీతం కూడా వీరికి అందడం లేదు.

ఒప్పందం ఉల్లంఘించి..

ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య కార్మికుల నియామకానికి 2021లో టెండర్లు పిలిచారు. ఆ సందర్భంగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పోను ప్రతి నెలా రూ.16 వేల జీతం చెల్లించేందుకు కాంట్రాక్టర్‌ ఒప్పందం చేసుకున్నారు. కానీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ పేరిట రూ.4,200 కట్‌ చేస్తున్నామని చెప్పి కొన్నాళ్లుగా నెలకు రూ.11,800 జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. పీఎఫ్‌ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. నిడద వోలు ప్రభుత్వాస్పత్రిలో కార్మికులకు ఆరు నెలల పీఎఫ్‌ బకాయి పెట్టారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐకి కట్‌ చేసుకుంటున్న మొత్తాన్ని తమ పేరిట చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. 12 శాతం సిబ్బంది జీతం నుంచి, 12 శాతం కాంట్రాక్టర్‌ పీఎఫ్‌కు జమ చేయాలి. కానీ, మొత్తం 24 శాతం తమ జీతం నుంచే కట్‌ చేస్తున్నారని, అది కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఒకటో తారీకు వస్తోందంటే అల్ప వేతన జీవులకు భయం.. అరువు తెచ్చిన కిరాణా సరకులకు డబ్బులు కట్టాలి.. కూరగాయల పద్దు చెల్లించాలి.. పాల బకాయి ఇవ్వాలి.. ఇంకా పాత బాకీలుంటే తీర్చేయాలి.. అన్నీ పోనూ ఇంకా ఏవైనా మిగిలితే ఇతర చిల్లరమల్లర ఖర్చులకు కాస్త దాచుకోవాలి.. అనుకోని ఖర్చు మీద పడితే చేతిలో సొమ్ముంటే సరే.. లేకపోతే మళ్లీ అప్పోసొప్పో చేయాలి.. ఇదంతా ఎటువంటి ఆటంకమూ లేకుండా జరగాలంటే ప్రతి నెలా వచ్చే కొద్దిపాటి వేతనమైనా టైముకు రావాలి. అలా రాకపోతే వారి బతుకు బండి తలకిందులవక మానదు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు అటువంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు.

ఫ నెలల తరబడి అందని జీతాలు

ఫ నెలకు రూ.16 వేలకు ఒప్పందం

ఫ ఇస్తున్నది మాత్రం రూ.11,800

ఫ అది కూడా నెలల తరబడి పెండింగ్‌

ఫ ఆస్పత్రుల్లోని పారిశుధ్య

కార్మికుల దుస్థితి

వేతన యాతన1
1/3

వేతన యాతన

వేతన యాతన2
2/3

వేతన యాతన

వేతన యాతన3
3/3

వేతన యాతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement