
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి అవసరం
పెద్దాపురం: ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్ అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించే క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్‌ను మంగళవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కబడ్డీ మీట్‌నుద్దేశించి శ్రీనుబాబు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు క్రీడారంగానికి ప్రాధాన్యనివ్వడంలో నవోదయ విద్యాలయాల పాత్ర కీలకమన్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి కృష్ణా క్లస్టర్, తుంకుర్ క్లస్టర్ అండర్–19 బాలుర లీగ్ మ్యాచ్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతానికి చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్త మట్టే శ్రీనివాస్
‘నవోదయ’లో కబడ్డీ మీట్ ప్రారంభం