
నేటి నుంచి ఆటల పండగ
జవహర్ నవోదయలో మూడురోజుల పాటు కబడ్డీ పోటీలు
పెద్దాపురం: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఆటల పండగ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యాయల ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలిపారు. దీనిలో భాగంగా సొమవారం తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సుమారు 450 మంది క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారు. 29వ తేదీ ఉదయం 9 గంటలకు క్రీడాజ్వాల, క్రీడార్యాలీ, శాంతికపోతం ఎగురవేత తదితర కార్యక్రమాలతో కబడ్డీ మీట్ ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి తెలిపారు. ఈ పోటీలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మట్టే శ్రీనివాస్, మట్టే ప్రసాద్‌బాబు ప్రారంభిస్తారన్నారు. కృష్ణ, ఖమ్మం, బీదర్, వయనాడు , కడప, షిమోగా, తుముకురు క్లస్టర్‌ల నుంచి అండర్–14, అండర్–17 బాలుర, బాలికల విభాగంలో పోటీలు ఉంటాయని ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, పీఈటీలు ఆర్.సత్యనారాయణ, అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి ఆటల పండగ