
భర్తపై భార్య కత్తి పీటతో దాడి
అమలాపురం టౌన్: తల్లికి వందనం డబ్బు ఏమి చేశావని అడిగినండుకు భర్తపై భార్య కత్తి పీటతో దాడి చేసి గాయపరిచింది. పట్టణ ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం...అమలాపురం పట్టణం సావరం రోడ్డులో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సావరం రోడ్డులో నివాసం ఉంటున్న పెనుమాల దుర్గాప్రసాద్, దుర్గ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారికి ఇటీవల తల్లికి వందనం పతకం కింద వచ్చిన డబ్బు ఏమి చేశావని భర్త దుర్గాప్రసాద్ భార్య దుర్గను అడిగాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య దుర్గ భర్తపై కత్తి పీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో భర్త చికిత్స పొందుతున్నాడు. అతని నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్‌బాబు చెప్పారు.