
వాడపల్లి స్వామికి దండిగా ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఆదివారం దండిగా ఆదాయం లభించింది. స్వా మివారిని విశేషంగా భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వే దాశీర్వచనం, అన్న ప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి ఈ ఒక్కరోజే రూ.6,73,949 ఆ దాయం వచ్చిందని దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం చక్రధరరావు వివరించారు. ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిత్య కల్యాణంతో పాటు ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులు అష్టోత్తర నామార్చనలు నిర్వహించారు.