
● చెత్తలో చిత్తై..
అందమైన లోకమనీ.. రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా.. అంత అందమైంది కానేకాదని ఓ కవి వాక్యం. నిజమే కదా. కొందరి జీవితాలు నిర్వచనాలకు అందనివి. వివర్ణమైన జీవనాన్ని ఎవరు ఆశిస్తారు? బరువైన బతుకుదెరువు ఎవరైనా ఎంచుకుంటారా? విధిరాతగా ఎంచి ఓ నిట్టూర్పు విడవడం తప్ప. ఈ శ్రమజీవిని కన్న తల్లి తన బిడ్డ ఇలా జీవించాలని కోరుకుంటుందా? ఎంత అగత్యమో కదా..? పూట గడవడానికి ముక్కుపుటాలు అదిరే మురుగునీటిలో తేలియాడే ప్లాస్టిక్, గాజు సీసాల సేకరణే జీవనాధారం కావాలా? చెత్తలో చిత్తైన జీవనపోరాటం ఎన్నాళ్లో..! రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ వీరభద్రపురం ప్రధాన డ్రైనేజీలో ఓ శ్రామికుని జీవనమిది.
– ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్)