ఉపయోగాలెన్నో... | - | Sakshi
Sakshi News home page

ఉపయోగాలెన్నో...

Jun 21 2025 3:33 AM | Updated on Jun 21 2025 3:33 AM

ఉపయోగ

ఉపయోగాలెన్నో...

మానసిక ఒత్తిడి నుంచి విముక్తికి చక్కటి మార్గం

జిల్లాలో పెరుగుతున్న ఆదరణ

పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

రాయవరం: దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఒడిదొడుకుల కారణంగా అధిక శాతం ప్రజలు బీపీ, సుగర్‌, థైరాయిడ్‌, ఊబకాయం, ఆస్తమా, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయినా రోగాలు పూర్తిగా నయం కాని పరిస్థితి. ఇటువంటి రోగాలు, రుగ్మతలను జయించడానికి నిత్యం యోగా సాధన చేయాలని గురువులు సూచిస్తున్నారు. రోజూ అరగంట నుంచి గంట వరకు యోగాసనాలు వేస్తే మానసిక ప్రశాంతతతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు.

2015 నుంచి ప్రపంచ యోగా దినోత్సవం

భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచ దేశాలకు విస్తరించింది. భారతదేశ ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి గుర్తించి 2015 జూన్‌ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. జూన్‌ 21న సూర్య గ్రహం భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది. ఆ రోజు దినంలో సమయం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.

అందరిలోనూ ఆసక్తి

జిల్లాలో యోగా నేర్చుకోవాలనే ఆసక్తి అన్ని వయసుల వారిలోనూ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. అమలాపురం, మండపేట, రావులపాలెం, కొత్తపేట, రామచంద్రపురం, రాయవరం, రామచంద్రపురం, ద్రాక్షారామ, రాజోలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు యోగా సెంటర్లలో శిక్షణ పొందేందుకు రోజూ వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా యోగా శిక్షణ అందిస్తున్నాయి.

యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు

విద్యార్థి దశ నుంచే యోగాపై ఆసక్తి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏటా పాఠశాలలు, కళాశాలల్లో యోగాడేను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా యోగాడేను పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని సమగ్ర శిక్షా ఎస్‌పీడీ బి.శ్రీనివాసరావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాఠశాలల్లో యోగాడే ప్రాధాన్యాన్ని వివరిస్తూ, పాఠశాలల్లో నిర్వహించిన యోగాడే కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను గూగుల్‌ ట్రాకర్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పలు పాఠశాలల్లో యోగా తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీనికి విద్యార్థుల నుంచి స్పందన లభిస్తోంది. కొన్ని విద్యాసంస్థలలో ఉదయం, సాయంత్రం వెసులుబాటును బట్టి రోజూ అరగంట విద్యార్థులకు యోగా శిక్షణ అందిస్తున్నారు. తద్వారా చిన్నారులలో క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక పరమైన ఆరోగ్య సమస్యలు దూరమవుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.

లాభాలు ఇవీ...

● యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.

● ఏ రంగానికి చెందినవారైనా తమ విధులపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారు.

● ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతమయ్యేవారు యోగాపై దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది.

● యోగాసనాలు వేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది.

● నిత్యం యోగా వల్ల విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెంపొందుతుంది.

● యోగాసనాల వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ ఉత్తేజమై ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

పూర్వ జన్మ సుకృతంగా

భావిస్తున్నా

వ్యాధుల నియంత్రణకు, మానసికంగా ధృఢత్వాన్ని సాధించడానికి యోగా ఉపయోగపడుతుంది. ఉద యం, సాయంత్రం వేళల్లో సాధనతో ప్రతి ఒక్కరూ ఉత్తేజితులవుతారు. శరీరం, మనసుపై అదుపు ఏర్పడుతుంది. 17 ఏళ్లుగా యోగాను ఉచితంగా నేర్పించడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా.

– వెలగల ఫణికృష్ణారెడ్డి, యోగా గురువు,

రాయవరం

దినచర్యలో భాగం కావాలి

యోగా మన దినచర్యలో భాగం కావాలి. యోగా చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవు. ధ్యానం, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సునాయాసంగా యోగా చేయవచ్చు.

– అల్లూరి శ్రీనివాసచౌదరి, యోగా శిక్షకుడు, లొల్ల, రాయవరం మండలం

విస్తృత ప్రయోజనాలు

యోగా సాధన మనిషి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకుని వస్తుంది. యోగాతో విస్తృత ప్రయోజనాలు ఉంటా యి. అంతరంగాన్ని చదివే దిశగా మనిషిని యోగా ప్రేరేపిస్తుంది. విద్యార్థి దశ నుంచి యోగాను నేర్పిస్తే ఉత్తమ పౌరులు తయారవుతారు.

– జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌,

సమగ్ర శిక్షా, అమలాపురం

నేడు ప్రపంచ యోగా దినోత్సవం

ప్రపంచ యోగా దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి జిల్లాలో ఉన్న 2,031 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు పాఠశాల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. జిల్లాలో 2.10 లక్షల మంది పాఠశాల విద్యార్థులతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌, ఐటీఐ తదితర విద్యాసంస్థల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఉపయోగాలెన్నో...1
1/4

ఉపయోగాలెన్నో...

ఉపయోగాలెన్నో...2
2/4

ఉపయోగాలెన్నో...

ఉపయోగాలెన్నో...3
3/4

ఉపయోగాలెన్నో...

ఉపయోగాలెన్నో...4
4/4

ఉపయోగాలెన్నో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement