సూక్ష్మ భరితం! | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మ భరితం!

Jun 21 2025 3:33 AM | Updated on Jun 21 2025 3:33 AM

సూక్ష

సూక్ష్మ భరితం!

పత్రచరితం!

రామచంద్రపురం రూరల్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని హసన్‌బాద జెడ్పీ హైస్కూల్‌లో 8 వ తరగతి విద్యార్థి ఎం.ఉత్తర వెంకట్‌ సున్నితమైన జిల్లేడు ఆకును కత్తిరించి రూపొందించిన యోగ ముద్ర విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా బలంగా ఉండే రావి ఆకు, పనస ఆకులపై ఇటువంటి చిత్రాలు రూపొందిస్తుంటారు. అయితే వెంకట్‌ జిల్లేడు ఆకుపై మనోహరంగా చిత్రించిన యోగముద్రను పాఠశాల డ్రాయింగ్‌ టీచర్‌ జి. శ్రీను, ప్రధానోపాధ్యాయురాలు పీఎస్‌బీఎస్‌కే సుందరి, ఉపాధ్యాయులు,విద్యార్ధులు అభినందించారు.

జిల్లేడు ఆకుపై రూపొందించిన యోగ ముద్ర

బోట్‌క్లబ్‌ (కాకినాడసిటీ): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండాల నిపుణులు అరిపాక రమేష్‌బాబు, సున్నితమైన చాక్‌పీస్‌ని ఉపయోగించి అతి చిన్న అంతర్జాతీయ యోగా సింబల్‌ను తయారు చేశారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సూక్ష్మ యోగా సింబల్‌ రూపొందించినట్లు చెప్పారు.

సూక్ష్మ భరితం! 1
1/3

సూక్ష్మ భరితం!

సూక్ష్మ భరితం! 2
2/3

సూక్ష్మ భరితం!

సూక్ష్మ భరితం! 3
3/3

సూక్ష్మ భరితం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement