
గడువు దాటితే ముప్పు
అంబాజీపేట: గ్యాస్ సిలిండర్‌తో పంట చేసుకోవడం ఎంత సులభమైన పద్ధతో... సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం కూడా ఉంటుంది. సిలిండర్‌కు కాల పరిమితి ఉంటుందని, దానిని గమనిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గడవు తేదీ ముగిసిన సిలిండర్‌ను వినియోగిస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతీ సిలిండర్‌పై గడువు తేదీ, కోడ్ విధానంలో మెటల్ ప్లేటుపై ముద్రిస్తాయి. సిలిండర్‌ను మార్చుకున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకొని వినియోగించాలి.
ఇలా గుర్తించాలి..
సిలిండర్ మెటల్ ప్లేటుపై ఏ–25, బీ–25 అని ఉంటే ఆ సిలిండర్ 2025 మార్చి–జూన్‌కి గడువు ముగుస్తుందని అర్థం. 25 అంటే 2025 సంవత్సరానికి, ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ‘ఏ’ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు ‘బి’ అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ‘సీ’ అక్షరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ‘డీ’ అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని గుర్తించాల్సి ఉంటుంది. సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేటుపై కోడ్ విధానంలో ఉన్న గడువు తేదీని. గడువు తేదీ నెల వ్యవధిలో ముగుస్తున్నట్లు సిలిండర్‌పై ఉంటే దానిని తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న కుటుంబాల వారికి నెల రోజులకు పైగా గ్యాస్ వస్తుంది. ఆ సిలిండర్ స్థానంలో వేరే సిలిండర్‌ను అడిగి తీసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది.
సిలిండర్‌కు 10 ఏళ్ల గడువు..
సిలిండర్ తయారైనప్పటి నుంచి 10 ఏళ్ల వరకు గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తారు. బీఐఎస్ అనుమతులు తీసుకున్న తర్వాతే సిలిండర్ మార్కెట్‌ల్లోకి వస్తుంది.
వినియోగదారుల హక్కులు..
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు హక్కులు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు. కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ఽధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునే సమయంలో తమ వద్దనే స్టౌ కొనుగోలు చేయాలని డీలర్ కోరవచ్చు. అయితే డీలర్ వద్ద కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు.
వంట గ్యాస్ సిలిండర్‌కు కాలపరిమితి
గ్యాస్ వినియోగంలో
జాగ్రత్తలు తప్పనిసరి