ఉరిమే ఉత్సాహంపై.. లీక్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

ఉరిమే ఉత్సాహంపై.. లీక్‌ పిడుగు

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

నీట్‌ పరీక్ష రద్దుపై

విద్యార్థుల్లో నిరుత్సాహం

తాము పడ్డ శ్రమ బూడిదలో

పోసిన పన్నీరైందని ఆవేదన

బాలాజీచెరువు (కాకినాడ): వైద్యవిద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎల్జిబుల్‌ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)ను రద్దు చేయడంతో అటు విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కొన్నేళ్లుగా శిక్షణ తీసుకొని ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన వారు మరికొన్ని రోజుల్లో ఫలితాలు వెలువడుతాయని ఎదురుచూస్తున్నారు. ఈ దశలో పేపర్‌ లీక్‌ కావడంతో మొత్తం పరీక్షనే రద్దు చేశారని సమాచారం రావడంతో నిరుత్సాహ పడ్డారు. తాము పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు. మళ్లీ సన్నద్ధం కావాలా అన్న ఆందోళన వారిలో నెలకొంది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్షకు కాకినాడ జిల్లాలో 3,126 మంది దరఖాస్తు చేసుకోగా 3,080 మంది పరీక్ష రాశారు.

Mö™èl¢ ç³È„> ™ól©-ÌS¯]l$ ˘

ప్రకటించాలి

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపడి నిర్మించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడటం కేంద్ర పరీక్షా సంస్థల ప్రాథమిక బాధ్యత. ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న అత్యవసర చర్యగా భావించాలి. అయితే, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా, త్వరితగతిన కొత్త పరీక్షా తేదీలను ప్రకటించి, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు విజ్ఞప్తి చేస్తున్నాం.

– మతుకుమిల్లి శ్రీవిజయ్‌

చాలా బాధాకరం

నా పేరు ఎండీ ఫాజీలా బేగం. నేను రెండు సంవత్సరాల నుంచి నీట్‌కి ప్రిపేర్‌ అయి, మే 3న జరిగిన ఎగ్జామ్‌ చాలా బాగా రాశాను. నాకు 600 మార్కులు వస్తాయని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. ఐతే ఎవరో చేసిన తప్పుకి నేను మళ్లీ ఎగ్జామ్‌ రాయాల్సి రావడం నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటుందని ఆశిస్తున్నాను. – ఎండీ ఫాజీలా బేగం, కాకినాడ

ఆందోళనకరం

నీట్‌ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్‌ లీక్‌ ఆరోపణలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కొంతమంది చేసిన తప్పులకు నిజాయితీగా చదివిన విద్యార్థులు శిక్ష అనుభవించకూడదు. సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా చదివిన విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తును కాపాడటం ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, డిజిటల్‌ మానిటరింగ్‌ అమలు చేయాలి. వైద్య విద్యపై ప్రజల నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యత. – డాక్టర్‌ ఎస్‌సీహెచ్‌ఎస్‌ రామకృష్ణ, కార్యదర్శి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 3వ తేదీన రాజమహేంద్రవరం కేంద్రంగా 8 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. నీట్‌కు జిల్లావ్యాప్తంగా 5వేల నుంచి 6 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి నీట్‌ 2026కు సిద్ధమయ్యారు. తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితులను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కోచింగ్‌లు, ఫీజులు, హాస్టల్‌ ఖర్చులు భరిస్తూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరీక్ష రద్దు కావడం వారిలో ఆందోళన రేకెత్తించింది. అసలు లీకేజీ ఎలా జరిగింది?, ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి బయటకు వెళ్లింది? పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయా? వంటి అంశాలపై పారదర్శక దర్యాప్తు జరిపి నిజాలను బయట పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement