మాతృభాషను గౌరవిద్దాం
రంపచోడవరం: మాతృభాషను గౌరవించి అభివృద్ధి చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.రవికుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కళాశాలలో తెలుగు, ఆంగ్ల విభాగాల సంయుక్త పర్యవేక్షణలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ డి.రవికుమార్ బహుమతులు అందించారు. మన మాతృభాష తెలుగును గౌరవించుకుని అభివృద్ధి చేసుకోవాలని ఆయన విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్‌ఆర్బీ చక్రవర్తి, కేజీ వెంకటేష్, డాక్టర్ ఎం. మాణిక్యాలరావు, విద్యార్థులు పాల్గొన్నారు.


