
దివ్యాంగులతో ఆటలాడొద్దు
ఫ తొలగించిన పింఛన్లను
పునరుద్ధరించాలి
ఫ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నిరసన
అమలాపురం రూరల్: దివ్యాంగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందంటూ అమలాపురం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన తెలిపారు. రీ సర్వే పేరుతో తొలగించిన దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. అనంతరం దివ్యాంగులతో కలసి కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి అంటే దివ్యాంగుల పింఛన్లు తీసేయడమా అని ప్రశ్నించారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి డిమాండ్ చేశారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ అర్హత ఉన్న దివ్యాంగులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పింఛన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక రీ సర్వే పేరుతో తొలగించి వారి పొట్టకొట్టిందన్నారు. వీటిని పునరుద్ధరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ పుట్టకతోనే అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు సదరమ్ క్యాంప్ పేరుతో అంగవైకల్యం శాతాన్ని తగ్గించి పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. అమలాపురం, పి.గన్నవరం పార్టీ కోఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇంటి వద్దకే పింఛన్లు అందించామని, ఇప్పుడు ఉన్నవాటిని తొలగించారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, మహిళా విభాగ అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, మహిళా విభాగ మాజీ కార్యదర్శి కాశి బాలమునికుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, పట్టణ, మండల అధ్యక్షులు సంసాని నాని, గుత్తుల చిరంజీవి, విత్తనాల శేఖర్, జిల్లా కార్యదర్శి కముజు రమణ, కుడుపూడి భరత్‌కుమార్ పాల్గొన్నారు.
దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో.. 4.
రీ సర్వేలో తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని జిల్లాలోని దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అమలాపురంలోని నల్ల వంతెన వద్ద వందలాది మంది దివ్యాంగులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాలో మూడు వేల మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని దివ్యాంగుల సంఘ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి పితాని ఏసుబాబు అన్నారు. వీరికి వైఎస్సార్ సీపీ జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు కాశి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌పైనే దివ్యాంగులు ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అలాంటి వారి పెన్షన్లు తొలగించడం దారుణమని అన్నారు. ఈ ఆందోళనలో సంఘాల నాయకులు లోవప్రసాద్, నాగవరపు పరశురాముడు, కె.అర్జునరావు, జలిపెల్ల సంపత్ కుమార్ పాల్గొన్నారు.

దివ్యాంగులతో ఆటలాడొద్దు