దివ్యాంగుల సంక్షేమానికి పథకాలు
అమలాపురం రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్ రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులకు డీఆర్‌ఓ చేతుల మీదుగా ఉపకరణాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల స్వతంత్రతను, చలన శీలతను, జీవన నాణ్యతను మెరుగు పరచడానికి విద్యను అభ్యసించేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. జిల్లా సర్వ శిక్ష అభియాన్ విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కదలలేని వారికి వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఊతకర్రలు, చేతి కర్రలు, వినికిడి యంత్రాలు, దృష్టి లోపం ఉన్నవారికి కంటి అద్దాలు, అంధులు చదవడం, రాయడం కోసం బ్రెయిలీ లిపి స్లేట్, మూడు చక్రాల వాహనాలు అంధులకు స్టిక్స్, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈవో షేక్ సలీం బాషా, కలెక్టరేట్ ఏఓ కె.కాశీ విశ్వేశ్వరరావు, కో ఆర్డినేటర్లు ఎంబీబీ సత్యనారాయణ ఏపీవో ఎంఏకే భీమారావు దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓ రాజకుమారి
దివ్యాంగులకు ఉపకరణాల అందజేత


