మొదటి భార్యకు, ప్రమీలకు మధ్య ఆస్తి తగాదాలు.. అంతలోనే..  | Woman was Brutally Murdered in Kadiri Anantapur District | Sakshi
Sakshi News home page

మొదటి భార్యకు, ప్రమీలకు మధ్య ఆస్తి తగాదాలు.. అంతలోనే.. 

Mar 22 2022 9:05 AM | Updated on Mar 22 2022 11:31 AM

Woman was Brutally Murdered in Kadiri Anantapur District - Sakshi

సాక్షి, కదిరి టౌన్‌: కదిరిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. కదిరి నివాసి బిల్లూరు ప్రమీల(36) స్థానిక వాణి వీధి (వేమారెడ్డి సర్కిల్‌) సమీపంలో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తోంది. ఈమె భర్త రంగారెడ్డి ఏడాది క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. సోమవారం ఉదయం ఇంటిలోనే ఆమె విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న డీఎస్పీ భవ్యకిషోర్, సీఐ సత్యబాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు.

ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్‌తో ఆమె తలపై మోది హతమార్చినట్లు గుర్తించారు. ప్రమీల భర్తకు ఇద్దరు భార్యలని, మొదటి భార్యకు, ప్రమీలకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని ఈ సందర్భంగా పోలీసుల ఎదుట హతురాలి సంబంధీకులు ఆరోపించారు. ఆస్తి కోసమే ఆమెను హతమార్చి ఉంటారని ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..)

Advertisement
 
Advertisement
Advertisement