మహిళ ఘాతుకం.. పాత ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని...

Woman Killed Lover With Help Of Another Lover At Nagarkurnool - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: తాగి వేధిస్తున్న ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి మహిళ హత్య చేసిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె  బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు వలస వెళ్లింది. అక్కడే ఉంటున్న రవికుమార్‌ (38)తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో వారు ఐదేళ్ల క్రితం అక్కడి నుంచి వచ్చి వట్టెంలో సహజీవనం చేస్తున్నారు.

కాగా, కృష్ణమ్మకు గతంలో జడ్చర్లకు  చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానంతో రవి రోజూ తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆ వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేక మాజీ ప్రియుడు శ్రీనివాస్‌కు విషయం చెప్పింది. వారిద్దరూ కలిసి ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిద్రలో ఉన్న రవికుమార్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ హన్మంత, ఎస్‌ఐ కృష్ణా ఓబుల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వెంటనే విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు చెప్పారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top