
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిత్తూరు : పెనుమూరు మండలం, కార్తికేయపురంలో విషాదం చోటుచేసుకుంది. సుకన్య అనే ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. తిరుమల టూటౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుకన్య ఆదివారం వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుకన్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు.