రైలు‌ వస్తున్న సంగతి మరిచి..

Two Persons Lost Life By Hitting Train In Eluru Railway Station - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏలూరు టౌన్‌లో విషాదం నెలకొంది. రైల్వే ట్రాక్‌పై మద్యం సేవించి మత్తులో మునిగిపోయిన ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ట్రైన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తంగెళ్లముడికి చెందిన సిద్దూ(23), కొత్తపేటకు చెందిన భరత్‌(25), పవన్‌లు ఏలూరు బస్టాండ్‌ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ పైకి చేరుకొని గతరాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న  ముగ్గురూ రైలు వస్తున్న సంగతి మరచి ట్రాక్‌పై అలాగే కూర్చుండిపోవడంతో వారిపై నుంచి ట్రైన్‌ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో భరత్‌, సిద్దూలు మరణించగా.. పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top