ఉద్యోగాల పేరిట మోసం.. నకిలీ అపాయింట్‌మెంట్‌ అర్డర్‌ రచ్చ!

Tiruvallur police Arrested A Man From Tamil Nadu For Allegedly Extorting Rs 50 Lakh - Sakshi

సాక్షి, తిరువళ్లూరు(చెన్నై): తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి  ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 74 మంది వద్ద రూ.50 లక్షలు వసూలు చేసి మోసం చేసినందుకు తిరువళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ రబ్బర్‌స్టాంపులు, పలు కీలక డాక్యుమెంట్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మేడవాక్కం ప్రాంతానికి చెందిన రంగన్‌ కుమారుడు బాలాజీ (36) హోమ్‌ హెల్త్‌కేర్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నాడు. తిరువళ్లూరు జిల్లా అమ్మయార్‌కుప్పానికి చెందిన జయకాంతన్‌ కుమారుడు వెంకటాచలం సంప్రదించి తనకు ఉద్యోగం కావాలని కోరాడు.

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని నకలీ అపాయింట్‌మెంట్‌ అర్డర్‌ను ఇచ్చాడు. నకిలీవని తెలియడంతో గురువారం తిరువళ్లూరు క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలాజీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో బాలాజీ ఇప్పటి వరకు 18 మందికి రైల్వే ఉద్యోగం, 54 మందికి ఈఎస్‌ఐ వైద్యశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.50 లక్షలు వసూలు  చేసినట్టు గుర్తించారు.  శుక్రవారం కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top