కంటిరెప్ప ఆగ్రహం, కనుపాపలు దూరం 

Sucide Attempt Mother Including Children Due To Family Disputes  - Sakshi

సాక్షి, బళ్లారి: కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కుటుంబ కలహాలతో ఆవేదన చెందింది. తానొక్కటే ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాథలవుతారని అనుకుని, ముందు వారిని నీటిలోకి పడేసి తరువాత తాను దూకింది. ఈ విషాద ఘటన శనివారం రాత్రి విజయపుర జిల్లా తికోటా తాలూకా జాలిగేర గ్రామ సమీపంలోని విఠలవాడి తండాలో జరిగింది.  

తరచూ కుటుంబ కలహాలు  
వివరాలు... తండాకు చెందిన రాముచౌహాన్‌కు సింధగి తాలూకాకు చెందిన గీత (32)తో 8 సంవత్సరాల క్రితం వివాహమైది. వీరికి సృష్టి (6), కిషన్‌ (3), సమర్థ (4) అనే పిల్లలున్నారు. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా దంపతులు గొడవ పడ్డారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన గీత ముగ్గురు పిల్లలను సంప్‌లోకి తోసి ఆమె కూడా దూకింది. కొద్ది సేపటికి ఇరుగుపొరుగు గమనించేటప్పటికీ నలుగురు విగతజీవులుగా కనిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తికోట పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు.   

(చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్‌..విచారణలో అతడు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top