Cyber Crime: కేవైసీ పేరుతో మహిళకు మెసేజ్‌ చేసి.. ఆపై | Online Money Fraud In Hyderabad | Sakshi
Sakshi News home page

Cyber Crime: కేవైసీ పేరుతో మహిళకు మెసేజ్‌ చేసి.. ఆపై

Aug 8 2021 9:11 PM | Updated on Aug 8 2021 9:15 PM

Online Money Fraud In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్‌): కేవైసీని నమోదు చేసుకోవాలంటూ ఓ మహిళకు మెసేజ్‌ పంపి ఆమె ఖాతా నుంచి రూ.65 వేలు కాజేశారు. ఈ ఘటన శనివారం అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌ కథనం ప్రకారం బాగ్‌ అంబర్‌పేటలో నివసించే ఉషా సుబ్రమణ్యం (62)కు గత నెల జులై 29న బ్యాంక్‌ ఖాతాలో కేవైసీ నమోదు చేసుకోవాలంటూ మెసేజ్‌ వచ్చింది.

మెసేజ్‌ చూసిన ఆమె అందులో ఉన్న లింక్‌ను ఓపెన్‌ చేసింది. దీంతో ఆమె ఖాతాలో ఉన్న రూ.65 వేలు మాయమయ్యాయి. కంగు తిన్న ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సైబర్‌క్రైం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement