విషాదం: ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి | Mother With Two Kids Commits Suicide At Vizianagaram | Sakshi
Sakshi News home page

విషాదం: ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి

Oct 16 2020 11:52 AM | Updated on Nov 24 2020 3:58 PM

Mother With Two Kids Commits Suicide At Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. కొత్తవలస మండలం నరపాం గ్రామానికి చెందిన గౌరీకి గణపతినగరంకు చెందిన లారీ డ్రైవర్‌ శ్రీను అనే వ్యక్తితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే గత కొంతకాలంగా భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.   (ఫార్మసిస్ట్‌ ఆత్మహత్య.. జనసేన పార్టీ వ్యక్తిపై ఆరోపణలు)

ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన గౌరీ శుక్రవారం తన ఇద్దరు కుమార్తెలు సంకీర్తన(7), హాసిని(6)లతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేమృతులు గౌరీ, సంకీర్తన, హాసినిగా గుర్తించారు. అభం, శుభం తెలియని చిన్నారులు ఈ ఘటనలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement