NEET Coaching: డబ్బుల కోసం హుండీల చోరీ

Man Stealing Money From Temple Hundis Over NEET Coaching At Hyderabad - Sakshi

రాంగోపాల్‌పేట్‌: నీట్‌ కోచింగ్‌ కోసం ఓ యువకుడు ఏకంగా గుడిలోని హుండీలకే కన్నం వేశాడు. ఇలా 8 గుళ్లలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరకు గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి చేశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన బాలాజీ కుమారుడు మూలే సంతోష్‌ అలియాస్‌ రవి (21) చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. 

  • నీట్‌ రాసి డాక్టర్‌ కావాలని కలలుగన్నాడు. గత ఏడాది నీట్‌ పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. దీంతో కోచింగ్‌ తీసుకోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చోరీల బాట పట్టాడు. 
  •  ఆలయాల్లో చోరీలు చేసి తరువాత వీలున్నపుడు చెల్లించాలని అనుకున్నాడు. జనవరి నుంచి ఐదు నెలల్లోనే  హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిల్లో ఉండే 7 దేవాలయాల్లో హుండీలను పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు.  
  • ఈ నెల 14న సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో చోరీ చేశాడు.  సుమారు రూ.80 వేల వరకు హుండీలో ఉండే నగదును దొంగిలించి తప్పించుకుని తిరుగుతూ గోపాలపురం పోలీసులకు ప ట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 74 వేల నగదును స్వాధీనం చేసుని రిమాండ్‌కు తరలించారు.  
  • ఇంకా డబ్బు సంపాదించడానికి  ఐపీఎల్, లూడో లాంటివి కూడా ఆడాడని పోలీసులు తెలిపారు. 
  • ఇదిలా ఉండగా నిందితుడు పోలీసులకు విచారణలో చుక్కలు చూపించినట్లు తెలిసింది. తాను చేసింది నేరమే కాదని నన్నెట్లా అరెస్టు చేస్తారని పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడు. దేవుడి డబ్బు తీసుకున్నా ఆయనకే ఇచ్చేస్తా ఇందులో తప్పెక్కడిది అంటూ వారినే ప్రశ్నిస్తూ విచారణలో ముప్పుతిప్పలు పెట్టాడు.
    చదవండి: ప్రియురాలిని బీరు సీసాతో పొడిచి చంపిన ప్రేమోన్మాది
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top