వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..! | Man Extramarital affair with Mother and Daughter Assassination | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..!

Apr 18 2022 12:32 AM | Updated on Apr 18 2022 7:38 AM

Man Extramarital affair with Monther and Daughter Assassination - Sakshi

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇటీవల జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. దానికి సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు.

వివరాలు: జిల్లాలోని చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ, తన కూతురు సంతోష కలిసి ఏప్రిల్ 10న చేగుంటకు వెళ్లారు. కానీ వారు తిరిగి ఇంటికి రాలేదు. సన్నిహితులు, బంధువులను సంప్రదించినా వారి ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో యాదమ్మ భర్త దగ్గరలోని పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్ చేశాడు. కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వడియారం అటవీ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని డెడ్ బాడీలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.

ఇక దాంతో పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకునారు. ఆ డెడ్ బాడీలను యాదమ్మ, సంతోషగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వడియారం గ్రామానికే చెందిన నగేశ్​పై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో నగేశ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమ శైలిలో విచారించగా ఆ ఇద్దరు తల్లీకూతుళ్లను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

హత్యకు గల కారణాలు: కొన్నాళ్ల క్రితం నగేశ్​కు తల్లీ కూతుళ్లతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ఈ క్రమంలో వారు నగేశ్‌ను తరచూ డబ్బులు ఇవ్వాలని వేధించసాగారు. తాము అడిగినంత ఇవ్వకపోతే తనపై కేసు కూడా పెడతామని బెదిరించారు. అయితే నగేశ్ మాత్రం ఎలాగైనా వారి పీడ తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్‌ ప్రకారం యాదమ్మతో పాటు తన కుమార్తె సంతోషను వడియారం అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. తల్లీ కూతుళ్లు అక్కడికి వెల్లి నిందితుడితో కలిసి మద్యం సేవించారు. ఇక ఆ మత్తులోనే నగేశ్​ తల్లీ కూతుళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement