Vijayawada Crime News: కారులో కీలక ఆధారాలు లభ్యం, రాహుల్‌ది హత్య?

సాక్షి,విజయవాడ: కారులో మృతదేహం ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. మృతదేహాన్ని గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యాజమాని రాహుల్‌దిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా కారులో కీలకమైన ఆధారాలు లభించాయి. కారులో తాడు, తలదిండు లభ్యం కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాహుల్ హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఆర్ధిక లావాదేవీల కారణంగానే హత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య వెనుక ఫైనాన్స్ వ్యాపారి హస్తం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి మెడకింది భాగం ఒరుసుకు పోయినట్లు క్లూస్ టీం గుర్తించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలను ఏర్పాటు చేశారు. కారు తిరిగిన ప్రాంతం లో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
సంబంధిత వార్తలు