
ప్రతీకాత్మక చిత్రం
మైసూరు: తమ్ముని ప్రేమ వ్యవహారానికి అన్న బలి అయ్యాడు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె పట్టణంలోని హొసూరు లేఅవుట్‌లో జరిగింది. వివరాలు.. చిక్కరాజు (30) అనే వ్యక్తి బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఉగాది పండుగ కోసం సొంతూరికి వచ్చాడు. చిక్కరాజు తమ్ముడు తమ కూతురిని ప్రేమిస్తున్నాడని ఆమె తండ్రి మహదేవ నాయక్, సోదరులు కిరణ్, అభిషేక్‌లు చిక్కరాజుతో గొడవపడ్డారు. చిక్కరాజును కత్తితో పొడవడంతో అక్కడే మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. గుండ్లుపేటె పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో..
బైక్ ప్రమాదంలో టెన్త్ విద్యార్థి మృతి
తుమకూరు(బెంగళూరు): పరీక్ష రాసేందుకు బైక్ పై వెళ్తున్న ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ సంఘటన కుణిగల్ తాలుకా హుందనగర గేట్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ఒకే బైక్‌పై వెళ్తూ అదుపు తప్పి ప్రహరీను ఢీకొంది. ప్రమాదంలో నవీన్ గౌడ (15) మృతి చెందాడు. దర్శన్, శరత్‌గౌడ అనే ఇద్దరు గాయపడ్డారు. ఆ ఇద్దరినీ ఆదిచుంచునగిరి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: భార్యతో విడాకులు.. ఆమె ఫ్రెండ్‌తో సాన్నిహిత్యం.. రవికిరణ్ అదృశ్యం.. కారణం అదేనా?