ఆన్‌లైన్‌ హార్స్‌ రేస్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం | Madhapur Police Arrested Two People Due To Online Horse Race Betting | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ హార్స్‌ రేస్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం

Feb 28 2022 5:31 AM | Updated on Feb 28 2022 10:32 AM

Madhapur Police Arrested Two People Due To Online Horse Race Betting - Sakshi

గుర్రపు పందేలపై నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ హార్స్‌ రేస్‌ బెట్టింగ్‌ గుట్టును మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు.

గచ్చిబౌలి: చెన్నైలో జరుగుతున్న గుర్రపు పందేలపై నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ హార్స్‌ రేస్‌ బెట్టింగ్‌ గుట్టును మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లితెలిపిన మేరకు.. శుక్రవారం చెన్నైలో జరిగే గుర్రపు పందేలపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

దీంతో ఎస్‌వోటీ పోలీసులు మాదాపూర్, గుట్టలబేగంపేట్‌లోని ఓ ఇంట్లో  సోదాలు నిర్వహించారు. బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా ఇద్దరి అదుపులోకి తీసుకొని మాదాపూర్‌ పోలీలకు అప్పగించారు. నిందితులు నెల్లూరుకు చెందిన వాకా వెంకటేశ్వర్‌ రెడ్డి(34), కర్నూల్‌కు చెందిన పందింటి ప్రదీప్‌(34)గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement