ఖమ్మం మైనర్‌ బాలిక ఘటనలో పోలీసుల ఓవరాక్షన్‌ | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి

Published Fri, Oct 16 2020 1:18 PM

Khammam Minor Girl Molestation Case Updates - Sakshi

సాక్షి, ఖమ్మం: ఓ వైపు హథ్రాస్ బాధితురాలి విషయంలో అర్థరాత్రి, కుటుంబ సభ్యులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించడం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి అధికారులు తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఖమ్మం మైనర్‌ బాలిక ఘటనలో కూడా పోలీసులు ఇలానే ఓవరాక్షన్‌ చేశారు. కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసి, సంతకాలు పెట్టించుకుని పంపించారు. ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడేనికి చెందిన ఉప్పలయ్య కుమార్తె కామాంధుడి చేతిలో దారుణ అత్యాచారానికి గురై దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే.(చదవండి: ఆ ఘటన మా కుటుంబానికి తీరని లోటు)

ఈ క్రమంలో పోలీసులు కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసి హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తరలించారు. ఇదేంటని మీడియా ప్రశ్నిస్తే లోపల పోస్టుమార్టం నడుస్తుందని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement