New Twist In Karnataka Man Drowned In Pond Mystery Case, Details Inside - Sakshi
Sakshi News home page

Karnataka: చెరువులో దూకి.. చెన్నైలో తేలిన టెక్కీ.. కేసులో ఊహించని ములుపు!

Nov 21 2022 12:05 PM | Updated on Nov 21 2022 1:50 PM

Karnataka: Man Drowned In Pond Mystery Case Find New Twist - Sakshi

కోలారు: 16వ తేదీన కోలారు తాలూకాలోని కెందట్టి చెరువులో బెంగళూరు రూరల్‌ బాగలూరులో ఉండే చెందిన టెక్కీ రాహుల్‌ (27), కూతురు దియా (3)తో కలిసి దూకాడన్న కేసులో మిస్టరీ వీడుతోంది. చిన్నారి దియా అదే రోజు చెరువులో శవమై తేలడం తెలిసిందే. టెక్కీ జాడ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులు అతడు చెరువులోకి దూకలేదని, పాపను విసిరేసి పరారై ఉంటాడని అనుమానం వ్యక్తంచేశారు. చివరకు అదే నిజమైంది. టెక్కీ రాహుల్‌ శనివారం చెన్నై నుంచి భార్యకు ఫోన్‌కు చేసి తనను కిడ్నాప్‌ చేశారని ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నానని చెప్పినట్లు తెలిసింది.

దీంతో అతడు బతికే ఉన్నాడని ఖరారైంది. మరో కొత్త డ్రామా అని అనుమానాలు అయితే కిడ్నాప్‌ అయ్యానని అతడు చెబుతున్న మాటలు మరో కొత్త డ్రామా అని భావిస్తున్నారు. 15వ తేదీన తన కుమార్తె దియాను బడికి వదలి వస్తానని కారులో బయలేదేరిన రాహుల్‌ అనంతరం కనిపించలేదు. తరువాత 16వ తేదీన తాలూకాలోని కెందట్టి చెరువులో కూతురు దియా మృతదేహం కనిపించింది. కానీ రాహుల్‌ కనిపించలేదు. రాహుల్‌ను నిజంగానే కిడ్నాప్‌ చేశారా, లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీడి దేవరాజ్‌ తెలిపారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఈ విధంగా కథ నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement