అక్కతో బావ గొడవ..తట్టుకోలేక బావమరిది

Karnataka: Auto Driver Killed In Yeshwanthpur - Sakshi

యశవంతపుర: పెళ్లయి అత్తింటికి పంపారు. అక్కడ తరచూ అక్కను బావ వేధించడంతో ఆమె తమ్ముడు తట్టుకోలేకపోయాడు. తన అక్కను వేధిస్తున్న బావపై అతడి బావమరిది దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన కర్నాకటలోని యశవంతపురలో చోటుచేసుకుంది. మొహమ్మద్‌ బాబా అలియాస్‌ బండి బాబా యశ్వంతపురలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యతో తరచూ ఘర్షణ పడేవాడు. తాజాగా ఆదివారం కూడా గొడవ జరగడంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు చాంద్‌  ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అక్కను వేధిస్తున్న బావ మొహమ్మద్‌ బాబాతో గొడవకు దిగాడు. దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా మృతుడిపై 2019లో ఒక హత్య కేసు నమోదై ఉండడం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..
చదవండి: ప్రభుత్వ టీచర్‌ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top