క్లబ్‌ టెకీల అంశంలో... మరో ఇన్‌స్పెక్టర్‌కు పబ్‌ దెబ్బ

The Inspector Fired For Failing To Stop Mob Running In Pub - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పబ్బుల్లో నడుస్తున్న గబ్బు దందాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్న ఇన్‌స్పెక్టర్లపై వేటు పడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ చర్యలు తీసుకుంటున్నారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో వెలుగులోకి వచ్చిన రేవ్‌ పార్టీ వ్యవహారంలో అప్పటి బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివచంద్ర సస్పెండ్‌ అయ్యారు.

తాజాగా ఆదివారం తెల్లవారుజామున బయటపడిన క్లబ్‌ టెకీల వ్యవహారంలో మధ్య మండలంలోని రామ్‌గోపాల్‌ పేటలో (ఆర్‌ పేట) ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సైదులుపై బదిలీ వేటు పడింది. సైదులును కమిషనర్‌ కార్యాలయానికి ఎటాచ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అదనపు ఇన్‌స్పెక్టర్‌ గడ్డం కాశికి బాధ్యతలు అప్పగించారు. 

(చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top