భార్య సంసారానికి పనికిరావని హేళన చేయడంతో అఘాయిత్యాలు

సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడలో చిన్నారులపై లైంగికదాడి కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంసారానికి పనికిరావంటూ భార్య హేళన చేసిందని.. అభిరామ్ దాస్ మహిళలపై కోపం పెంచుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన కోరిక తీర్చాలని ఒంటరి మహిళలను అభిరామ్ వేధించేవాడని తెలిసింది. లైంగికదాడిని వ్యసనంగా మార్చుకున్న అభిరామ్ చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
కాగా,ఈనెల 4న దమ్మాయిగూడకు చెందిన మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి నిందితుడు అభిరామ్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈనెల 9న అదే ప్రాంతంలో మరో చిన్నారిని కిడ్నాప్‌నకు యత్నించాడు. అతడు డ్రగ్స్‌కు సైతం బానిసైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు విచారణలో భాగంగా పోలీసుల అదుపులో ఒడిశాకు చెందిన అభిరామ్ దాస్.. నుదుటిపై తుపాకీ పెట్టి తనను కాల్చేయాలంటూ పోలీసులను వేడుకోవడం గమనార్హం.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు