వామ్మో.. బిహారి గ్యాంగ్‌ .. యజమాని బయటి రాష్ట్రాలకు వెళ్లడంతో..

House Robbery Case In Karnataka - Sakshi

సాక్షి, బనశంకరి(కర్ణాటక): యజమాని ఇంట్లో వెండి ఆభరణాలు దోచుకెళ్లిన బిహారీ ముఠాను కోరమంగల పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షల విలువచేసే 17 కేజీల వెండి వస్తువులు, మూడు విలువైన గడియారాలు, నాలుగు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోటూకుమార్, రంజిత్‌కుమార్, పంకజ్‌కుమార్, గౌతమ్‌కుమార్‌. వీరు ఉపాధి కోసం బెంగళూరుకు చేరుకున్నారు.

చోటుకుమార్‌ కోరమంగల బ్లాక్‌లో పారిశ్రామికవేత్త ఇంట్లో పనిచేసేవాడు. యజమాని బయటి రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో చోటుకుమార్‌ ముగ్గురు స్నేహితులను పిలిపించి విలువైన వస్తువులను వారికి ఇచ్చి పంపాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది.    

కుుమ్మక్కు అప్రయిజర్‌ అరెస్టు 
దొడ్డబళ్లాపురం: ఖాతాదారులు డూప్లికేట్‌ నగలు కుదువ పెట్టడానికి సహకరించిన అప్రయిజర్‌పై బ్యాంకు అధికారులు కేసు నమోదుచేశారు. ఈ సంఘటన కనకపుర తాలూకా హొన్నిగనహళ్లి కెనరా బ్యాంకులో చోటుచేసుకుంది. బ్యాంకులో 32 ఏళ్లుగా మలగూరు రాజన్న అప్రయిజర్‌గా పనిచేస్తున్నాడు.

352 మందికి ఇతని ద్వారా బంగారు నగల పరీక్షలు జరిపించి అసలైనవేనని తేల్చడంతో పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చారు. ఎక్కువమంది రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు అనుమానంతో నగలను పరీక్షించగా మొత్తం 81 మంది నకిలీ నగలు కుదువ పెట్టి డబ్బు కొట్టేశారని తేలింది. ఇందులో రాజన్న పాత్ర కూడా ఉండడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top