గుడేకల్‌ చెరువులో బయటపడ్డ మృతదేహం.. హిజ్రాగా గుర్తింపు | Hijra End Her Life In Kurnool District | Sakshi
Sakshi News home page

గుడేకల్‌ చెరువులో బయటపడ్డ మృతదేహం.. హిజ్రాగా గుర్తింపు

Apr 12 2022 7:07 PM | Updated on Apr 12 2022 7:07 PM

Hijra End Her Life In Kurnool District - Sakshi

గంగమ్మ అలియాస్‌ ఎర్రిస్వామి (ఫైల్‌)

ఎమ్మిగనూరురూరల్‌ (కర్నూలు): గుడేకల్‌ గ్రామ చెరువులో సోమవారం హిజ్రా మృతదేహం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన హిజ్రా గంగమ్మ అలియాస్‌ ఎర్రిస్వామి (36) 20 రోజుల క్రితం ఎమ్మిగనూరుకు వచ్చాడు. పక్షవాతంతో పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంలో ఉండటంతో స్థానికులు వేదాస్‌ సేవా సమితి అనాథ ఆశ్రమానికి చేర్చారు.

అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, బళ్లారిలో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అయితే మూడు రోజులుగా కనిపించకపోవటంతో బళ్లారికి వెళ్లినట్లు భావించారు. కాగా సోమవారం ఉదయం చెరువులో చేపలు పట్టేవారికి మృతదేహం కనిపించడంతో రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

మూడు రోజులు కావటంతో శరీరం ఉబ్బిపోయి, గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉంది. అయితే మృతుడి జేబులోని పర్సులో ఆధార్‌ కార్డు ఉండటంతో మృతుడి ఆచూకీ తెలిసింది. ఈ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement