మెట్‌పెల్లిలో దారుణం.

Former Deputy Sarpanch Murdered Over land Disputes In karimnagar - Sakshi

సాక్షి, శంకరపట్నం(మానకొండూర్‌): శంకరపట్నం మండలం మెట్‌పెల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్‌ నాయకుడు రాచమల్ల సంపత్‌ హత్యకు గురయ్యాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మెట్‌పెల్లి గ్రామానికి చెందిన రాచమల్ల సంపత్‌కు భోనగిరి ఓదయ్య మధ్య భూగాదాలు ఉన్నాయి. ఇటీవల ఈ భూముల విషయంలో కేశవపట్నం పోలీసులను ఆశ్రయించారు. పెద్ద మనుషుల సమక్షంలో శుక్రవారం పంచాయితీ ఉండగా గురువారం పొలం వద్దకు సంపత్‌ వెళ్లాడు. పొలం వద్ద రాచమల్ల సంపత్, బోనగిరి ఓదయ్య ఘర్షణపడ్డారు. సమీపంలోని భోనగిరి ఓదయ్య కుమారుడు జంపయ్య వచ్చి సంపత్‌ మెడ వెనుక భాగంలో గొడ్డలితో నరికాడు. రక్తపు మడుగులో పడి సంపత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. చదవండి: మోజు తీరగానే ఫోన్‌లో తలాక్..‌ 

సమాచారం అందుకున్న మృతుడి తండ్రి రాజలింగం, తల్లి నాగమల్లమ్మ, భార్య రజిత సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించారు. మెట్‌పెల్లిలో భూతగాదాలతో రాచమల్ల సంపత్‌ హత్యకు గురైన విషయం తెలుసుకున్న డీసీపీ శ్రీనివాస్, హుజురాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు ,హుజురాబాద్‌ రూరల్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్‌ సీఐలు కిరణ్, సృజన్‌రెడ్డి, రాములు, సైదాపూర్, వీణవంక, ఇల్లందకుంట ఎస్సైలు భారీగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. హత్యకు గురైన సంపత్‌ తండ్రి రాజలింగం, కుటుంబసభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. భూతగాదాలతోనే సంపత్‌ హత్యకు గురయ్యాడని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

పోలీసుల వత్తాసుతో హత్య
భూవివాదంలో కేశవపట్నం పోలీసులను ఆశ్రయిస్తే స్పందించకుండా ఓదయ్యకే వత్తాసు పలకడంతో మాటువేసి తన కొడుకును హత్య చేశారని మృతుడి తండ్రి రాజలింగం ఆరోపించారు. వీణవంక మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిపై ఆరోపణలు చేశారు. కేశవపట్నం స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి తండ్రి ఆరోపణలు చేయడంతో కేశవపట్నం ఎస్సై రవిని సంఘటన స్థలం నుంచి స్టేçషన్‌కు పంపించడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top