పెళ్లి ఇష్టం లేక యువతి బలవన్మరణం | Forced Marriage Bride Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేక యువతి బలవన్మరణం

Aug 7 2020 9:00 AM | Updated on Aug 7 2020 9:00 AM

Forced Marriage Bride Commits Suicide in Hyderabad - Sakshi

నాగోలు: పెద్దలు కుదిర్చిన వివాహం  చేసుకోవడం ఇష్టంలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్‌పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, కలకొండ గ్రామానికి చెందిన పులి లింగమ్మ ఐదేళ్లుగా తన కుమారుడు కృష్ణ, కుమార్తె లక్ష్మి(27)తో కలిసి ఎల్‌బీనగర్, పిండి నారాయణరెడ్డి కాలనీలో నివాసముంటోంది. లక్ష్మి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధం చూసేందుకు   బుధవారం ఉదయం లింగమ్మ తన కుమారుడు కృష్ణతో కలిసి ఈసీఐఎల్‌కు వెళ్లింది.

సాయంత్రం ఇంటికి తిరిగివచ్చేసరికి లక్ష్మి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది.  ఆత్మహత్యకు ముందు లక్ష్మి తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడిందని అతడు అక్కడికి చేరుకునే లోపే ఉరివేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement