దారుణం : బిడ్డల గొంతుకోసిన తండ్రి | Father Attack On Daughter In Siddipet | Sakshi
Sakshi News home page

ఇద్దరి బిడ్డల గొంతుకోసిన తండ్రి

Nov 7 2020 12:43 PM | Updated on Nov 7 2020 3:27 PM

Father Attack On Daughter In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి.. ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసి దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు 108 ద్వారా బాధితులను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న భూంపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద కూతురు అంజరిన (8), చిన్న కూతురు అలేన (6) సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే తండ్రి ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసినటట్లు స్థానికులు చెబుతున్నారు.


స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ దాదాపు 15 ఏళ్లుగా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. కొంత కాలంగా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. దీంతో గ్రామస్తులు వారి కుటుంబాన్ని మోతె నుంచి వెల్లగొట్టడంతో చిట్టాపూర్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇంట్లో గొడవ జరిగింది. దీంతో తలుపులు మూసి కూతుళ్ళ గొంతు కొస్తానని బెదిరింపులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే ఇద్దరు కూతుళ్ళ గొంత కోయడానికి సిద్ధమైయ్యడు. సమయానికి పోలీసులు రావడంతో ఇద్దరి పిల్లలకు ప్రాణప్రాయం తప్పింది. ఈ క్రమంలో పోలీసులపైకి సైతం మహమ్మద్‌ దాడికి ప్రయత్నించాడు. అయినప్పటికీ  ప్రాణాలకు తెగించి చిన్నారులను కాపాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement