నకిలీ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు

సాక్షి, ఒంగోలు: నకిలీ సర్టిఫికెట్స్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును ప్రకాశం జిల్లా పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఇంకొల్లు, చీరాల, యర్రగొండపాలెం విశాఖపట్నంలను కేంద్రంగా చేసుకుని నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఏడుగురు నిందితులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాలలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ కేంద్రాలను గుర్తించి నిందితులు, వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, కంప్యూటర్‌లు నకిలీ పత్రాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మీడియాకు వివరించారు. జేఎన్‌టీసీ అనే స్వచ్ఛంద సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకొని పలుమోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసును చాకచాక్యంగా చేధించిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. (పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి