Degree Student: చదువుకు దూరమై.. బతకడం భారమై.. | Degree Student Commits Suicide By Hanging In Sri Sathya Sai District | Sakshi
Sakshi News home page

Degree Student: చదువుకు దూరమై.. బతకడం భారమై..

Apr 14 2022 7:31 AM | Updated on Apr 14 2022 7:49 AM

Degree Student Commits Suicide By Hanging In Sri Sathya Sai District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమైన ఓ డిగ్రీ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురై బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ధర్మవరం రూరల్‌(శ్రీసత్యసాయి జిల్లా): కొన్ని పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమైన ఓ డిగ్రీ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురై బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మండల పరిధిలోని మల్లేనిపల్లి గ్రామానికి చెందిన పూజారి రాములు, అంజనమ్మ దంపతుల కుమార్తె రాధారాణి(19) పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.

చదవండి: ఏలూరు: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

కొన్ని కారణాలతో కుటుంబీకులు ఆమెను చదువు మాన్పించారు. దీంతో తన భవిష్యత్‌ అంధకారం అయ్యిందని రాధారాణి తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే బుధవారం ఎవరూలేని సమయంలో ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement