టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై చీటింగ్‌ కేసు

Cheating Case Against TDP State General Secretary - Sakshi

సాక్షి,బంజారాహిల్స్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ జ్ఞానేశ్వర్‌ నాయు డు అలియాస్‌ జీవీజీ నాయుడుతో పాటు మ రొకరిపై జూబ్లీహిల్స్‌ పో లీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 70 జర్నలిస్టు కాలనీలో ముంబైకి చెందిన రోనక్‌ కొటేచాకు అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి.  ఇందులో ఓ ఫ్లాట్‌ను ఫోర్జరీ పత్రాలు, నకిలీ సంతకాలు, నకిలీ ముద్రలతో తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడుతో పాటు పీసీహెచ్‌ ఈ–జోన్‌ యజమాని బల్వీందర్‌ సింగ్‌ కబ్జా చేశారు.

ఈ ఫ్లాట్‌ను బల్వీందర్‌ సింగ్‌ 2013లో రొనక్‌ కొటేచాకు విక్రయించాడు. రొనక్‌ కొటేచా ముంబైలో బిజీ వ్యాపారి కాగా ఇక్కడికి రాలేకపోవడంతో ఇదే అదునుగా భావించిన జీవీజీ నాయుడు సదరు ఫ్లాట్‌ను ఆక్రమించి అందులో తిష్టవేశాడు. ఫోర్జరీ పత్రాలు క్రియేట్‌ చేసి సిటీ సివిల్‌ కోర్టులో ఫ్లాట్‌ తనదేనంటూ నకిలీ పత్రాలు సమర్పించి కేసు వేశాడు. విషయం తెలుసుకున్న రొనక్‌ పలుమార్లు తన ఫ్లాట్‌ ఖాళీ చేయాల్సిందిగా జీవీజీ నాయుడుకు విజ్ఞప్తి చేశాడు.

అయితే నాయుడు ఈ విషయాన్ని పెడచెవిన పెట్టాడు. తాను టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుడినని తనను ఎవరు ఏం చేయలేరని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటువైపు తొంగిచూస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జీవీజీ నాయుడు, బలి్వందర్‌ సింగ్‌లతో పాటు మరో ఇద్దరిపై   కేసు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారి జీవిజీనాయుడు కోసం గాలిస్తున్నారు.
చదవండి: పుట్టినరోజు వేడుకలకొచ్చిన మామ ఇంట్లో అల్లుడు చోరీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top