ప్రయాణికులకు బస్సు డ్రైవర్‌ షాక్‌.. ఏం చేశాడంటే..!

Bus Driver Shock To Passengers In Nalgonda District - Sakshi

సాక్షి, నల్లగొండ: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ఘరానా మోసానికి పాల్పడ్డారు. నార్కట్‌పల్లి వద్ద భోజనం కోసం బస్సును ఆపిన డ్రైవర్‌.. ప్రయాణికులను మధ్య మార్గంలో వదిలేసి లగేజీతో ఉడాయించారు. ట్రావెల్స్‌ బస్సులోనే 64 మంది ప్రయాణికుల లగేజీ ఉంది. నార్కట్‌పల్లి ఫంక్షన్‌ హాల్‌లో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు. బాధితుల వద్దకు నకిరేకిల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బస్సు ఆచూకీని త్వరగా గుర్తించాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు.

చదవండి: బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్‌

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంకు చెందిన కూలీలు, కేరళలోని ఎర్నకులంలో జీవనం కోసం వలస వెళ్లారు. కాగా  స్వంత గ్రామానికి వెళ్లేందుకు కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బ్రోకర్ ద్వారా బుక్ చేసుకుని అస్సాంకు బయలు దేరగా, కూలీలను మార్గం మధ్యలో నార్కెట్‌పల్లి భోజన హోటల్‌ వద్ద కూలీలను దింపి, బస్ టైర్ రిపేర్ చేయించుకుని వస్తానని చెప్పిన డ్రైవర్.. ఉడాయించాడు. 4 గంటలు గడిచిన బస్సు రాకపోయేసరికి బిత్తరపోయిన కూలీలు.. మోసపోయామని గ్రహించి స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఏడుగురు మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top