ప్రేమపేరుతో మైనర్‌కు వేధింపులు  | Boy Molested On Minor Girl In Warangal | Sakshi
Sakshi News home page

ప్రేమపేరుతో మైనర్‌కు వేధింపులు 

Sep 15 2021 11:14 AM | Updated on Sep 15 2021 11:14 AM

Boy Molested On Minor Girl In Warangal - Sakshi

భార్గవి (ఫైల్‌)

సాక్షి,  కొమురవెల్లి(వరంగల్‌): ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో ఓ చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన  కొమురవెల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన బత్తిని శ్రీనివాస్, జ్యోతి దంపతుల కూతురు బత్తిని భార్గవి (16). పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

కాగా కొమురవెల్లి గ్రామానికి చెందిన కుర్ర మధు తనను ప్రేమించమని వెంట పడుతుండటంతో మనస్తాపానికి గురైన భార్గవి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొంది. మృతురాలి తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.   

చదవండి: చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement