డ్రగ్స్‌తో బాలీవుడ్‌ డ్యాన్సర్‌ పట్టివేత | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో బాలీవుడ్‌ డ్యాన్సర్‌ పట్టివేత

Published Sun, Sep 20 2020 5:15 AM

Bollywood Dancer Kishore Shetty arrested by CCB - Sakshi

యశవంతపుర: మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్‌కు చెందిన నటుడు కిశోర్‌ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలీవుడ్‌లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్‌శెట్టి ఒక డ్యాన్సర్‌. బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి, డ్రగ్స్‌ లింక్‌పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్‌శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్‌ మిత్రుడు ప్రతీక్‌శెట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్‌ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదాపడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement