మాయలేడీలు.. న్యూడ్‌ వీడియోలతో వలపు వల..

Blackmail With Nude Videos - Sakshi

సాక్షి, కామారెడ్డి: అపరిచిత మహిళల ఫోన్‌ కాల్స్‌ విషయంలో కొందరు చేస్తున్న ‘తప్పు’టడుగులు వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముందువెన కా ఆలోచించకుండా అపరిచిత మహిళలతో జరిపే సంభాషణలు దారితప్పి వారి మెడకే చుట్టుకుంటున్నాయి. కైపెక్కించే మాయ మాటలతో మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పలువురు వలపు వలలో పడి మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
చదవండి: వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో..

తెలిసీ తప్పు చేశామని తరువాత బాధపడుతున్నారు. విషయం ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కితే పరువు ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో మనోవ్యధకు గురవుతున్నారు. భిక్క నూరులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వలపు వలలో పడిన విషయంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఘటనలను పలువురు ‘సాక్షి’కి వివరించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి కూడా వలపు వలలో పడి ఇబ్బందులపాలయ్యాడు. చాలా డబ్బు లు పోగొట్టుకున్నానని బాధితుడు ‘సాక్షి’కి వివరించాడు.

ఎల్లారెడ్డికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కూడా ఓ తల్లీకూతురు వలపు వలలో చిక్కి ఆర్థికంగా చితికిపోయాడు. వీడియోకాల్స్‌తో తల్లీ కూ తురు న్యూడ్‌గా లైవ్‌లో కనబడడం, దానికి సదరు వ్యక్తి కూడా న్యూడ్‌గా మారి వాళ్లు ఆన్‌లైన్‌లో డబ్బు లు పంపమని కోరినపుడల్లా పంపాల్సి వచ్చింది. వేల రూపాయలు వారికి చెల్లించాడు. అప్పట్లో కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్‌లో నివసించే ఓ గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి మాయలేడీల వలలో పడి ఇబ్బందులు పడిన విషయం ‘సాక్షి’ పాఠకులకు విధితమే.

వీడియోకాల్‌తో కైపెక్కిస్తున్నారు.. 
వారం, పది రోజులు మాట్లాడిన మాయలేడీలు ఓ సారి వీడియోకాల్‌ చేయండి సార్‌ అంటారు. ఇంకేముంది మనోడు ఆ మాయలో పడి వీడియో కాల్‌ చేయడం, ఆమెను చూసి చొంగచార్చుకోవడం జరుగుతోంది. రోజూ ఒకటి, రెండు సార్లు వీడియో కాల్‌ చేస్తూ మరింత దగ్గరవుతున్నారు. భార్య, సెక్స్‌ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుతూ ‘నేను నచ్చా నా’ అంటూ మొదలవుతుంది. వీడియో కాల్‌లో ఉండగానే న్యూడ్‌గా మారుతున్నారు. దీంతో మగవాళ్లు కూడా ఆ మత్తులో న్యూడ్‌ అవుతున్నారు. 

ఎంతోమంది బాధితులు.. 
మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. నమ్మించే మాటలతో, కైపెక్కించే వలపులతో వలలో వేసుకుని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో చాలామంది ఇలా మోసపోతూనే ఉన్నారు. కొందరైతే తెలిసి మరీ మోసపోతున్నారు. అయితే తమకు జరిగిన ఇబ్బందిని బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని వెనకడుగు వేస్తున్నారు. మాయలేడీల వలలో పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

తియ్యటి మాటలతో స్నేహం 
అపరిచిత మహిళలు ఫోన్‌ చేసి ‘సార్‌’ అంటూ తియ్యగా మాట్లాడతారు. ఎవరు అని ప్రశ్నిస్తే మేం వేరే వాళ్లకు కాల్‌ చేశామని, పొరపాటున మీ కు వచ్చిందంటూ సారీ చెబుతారు. పరవాలేదని అంటే చాలు ‘మీ పేరు, మీ ఊరు సార్, ఏం చేస్తారు సార్‌’ అంటూ మాటలు కలుపుతారు. ఆడగొంతు, ఆపై తియ్యగా మాట్లాడడంతో సహజంగా మగవాళ్లు వాళ్లతో మాట కలపడం, ఇదే అదనుగా అపరిచిత మహిళ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. రోజూ కాల్‌ చేసి ఏదో మాట్లాడుతూ టైంపాస్‌ చేయడం ద్వారా, ఆమె ఫోన్‌ కోసం ఎదురుచూసే పరిస్థితిని తీసుకువస్తున్నారు.

వీడియో కాల్‌ రికార్డులు పంపి బ్లాక్‌ మెయిలింగ్‌.. 
పది, పదిహేను రోజులుగా ఫోన్‌కాల్‌ ఆ తరు వాత వీడియో కాల్స్‌ ద్వారా దగ్గరైన మహిళలు న్యూడ్‌ వీడియోలను రికార్డు చేసి, వాటిని వాట్సాప్‌కు పంపుతున్నారు. ఆ వీడియోలను చూసి మనోళ్లు షాక్‌ అవ్వాల్సిందే. వీడియో క్లిప్పింగులు పంపి, డబ్బులు డిమాండ్‌ చేస్తున్నా రు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే సోషల్‌ మీ డియాలో వైరల్‌ చేస్తామంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగుతున్నారు. కొందరు బతిమాలుకుని ఎంతో కొంత డబ్బు అప్పగించి క్లోజ్‌ చేసుకుంటుండగా, డబ్బులు ఇవ్వని వారిని మానసికంగా వేధిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top