812 కిలోల గంజాయి స్వాధీనం | 812 kg of cannabis seized Andhra Pradesh | Sakshi
Sakshi News home page

812 కిలోల గంజాయి స్వాధీనం

Jul 11 2022 5:00 AM | Updated on Jul 11 2022 5:00 AM

812 kg of cannabis seized Andhra Pradesh - Sakshi

కారులో పట్టుబడిన గంజాయి

కోటవురట్ల (అనకాపల్లి జిల్లా): సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్లు పోలీసుల ఛేజింగ్‌ నుంచి తప్పించుకుపోయారు. వారు వదిలిన వాహనాల నుంచి పోలీసులు 812 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై పోలీసులకు వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో కలిసి పి.కె.పల్లి–ఆక్సాహేబుపేట ప్రాంతంలో నిఘా పెట్టారు.

అదే సమయంలో రెండు కార్లు, ఒక బైకు అనుమానాస్పదంగా రావడంతో పోలీసులు వెంబడించారు. అయితే స్మగ్లర్లు అతి వేగంగా పోలీసులకు దొరక్కుండా కార్లు నడుపుతూ రోడ్డుకు ఎగువన ఉన్న ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి అందులో నుంచి దూకేసి పొదల్లో పరుగు తీసి తప్పించుకున్నారు. వాహనాల్లో 812 కిలోల గంజాయి పట్టుబడినట్టు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. దీని విలువ రూ.16.24 లక్షలు ఉంటుందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement