సాఫ్ట్‌బాల్‌పై ఇష్టమే మమ్మల్ని నడిపిస్తోంది | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌పై ఇష్టమే మమ్మల్ని నడిపిస్తోంది

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

చదువుతో పాటు సాఫ్ట్‌బాల్‌ సాధనకు సమయం కేటాయిస్తున్నాం. ఆటలో గెలవాలనే తపన మాలో క్రమశిక్షణను పెంచింది. ఇద్దరం ప్రతి రోజూ క్రమం తప్పకుండా శిక్షణ పొందుతున్నాం. ఇద్దరం కలిసి మా పీసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలకు పతకాలు తీసుకురావాలనేది మా ఆశ. రోజూ ఉదయం, సాయంత్రం మైదానంలో ఇద్దరం కలిసి సాధన చేయడం వల్ల ఆటపై భయం పోయింది. పీడీ సర్‌ ఇచ్చే కోచింగ్‌ సహాయంతో సాఫ్ట్‌బాల్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాం. – హేమంత్‌, పద్మశ్రీ,, నగరి

క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరతాం

మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆటపై ఉన్న ఆసక్తి తగ్గలేదు. చెల్లెలు అక్షిత, నేను రోజూ మైదానంలో శిక్షణ తీసుకుంటున్నాం. సాఫ్ట్‌బాల్‌ క్రీడలో రాణించి భవిష్యత్తులో క్రీడా కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధించి కష్టాలను జయిస్తాం. ప్రైవేట్‌ పాఠశాలల వారే కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదివే మేము కూడా కష్టపడితే సాధించగలమని నిరూపిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మంచి స్థానం సాధించడమే మా ఇద్దరి ధ్యేయం.

– అవినాష్‌, అక్షిత, భరత్‌నగర్‌, చిత్తూరు నగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement