చిత్తూరు కలెక్టరేట్ : నగరిలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నమెంట్లో చిత్తూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ప్రతిభ చాటి జిల్లాకు ఘన కీర్తి తీసుకువచ్చిన విజేత జట్టు సభ్యులను కలెక్టర్ సుమిత్ కుమార్, డీఈఓ లక్ష్మీనారాయణ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి లోకనాథం, పీఈటీ, పీడీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిరాజ్ అహ్మద్, సీనియర్ పీడీలు రవి, నూరుద్దీన్, శరత్ బాబు, అరుణ్ పాల్గొన్నారు.
ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఐటీఐ కళాశాలల్లో ఐదో విడత అడ్మిషన్లకు అర్హత, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు www.itiadmirrio nr.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.15న మధ్యాహ్నం 2 గంటలలోపు సర్టిఫికెట్లు పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. 2.30 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. ఇతర వివరాలకు 6302634177, 9440738121, 9182590869 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


